![]() |
![]() |

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 రీసెంట్ ఎపిసోడ్ మస్త్ ఎంటర్టైన్ గా సాగింది. ఈ వారం ఎపిసోడ్ కి చిత్రమ్మ ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్స్ అంతా కూడా పూలు జల్లి ఆమెను ఆహ్వానించారు. ఇక ఫస్ట్ కంటెస్టెంట్ గా జయరాం "మైకేల్ మదన కామరాజు" మూవీ నుంచి "రంభంభం" అంటూ పాడిన ఫాస్ట్ బీట్ సాంగ్ కి అందరూ ఫిదా ఇపోయారు. "నువ్వు పాడిన విధానం నాకు చాలా నచ్చింది ...నాకు పాత బాలు గారు గుర్తొచ్చారు" అని చెప్పారు.
అందుకే తెలుగు ఇండియన్ ఐడల్ లో జయరాంని జూనియర్ బాలసుబ్రమణ్యం అని పిలుస్తామన్నాడు హోస్ట్ హేమచంద్ర. "నువ్వు పాడిన పాట మంచి ఎనెర్జీ ఇచ్చే సాంగ్. నేను, కార్తిక్ కానీ లేదా నేనొక్కడినే కానీ వెళ్ళేటప్పుడు ఈ సాంగ్ పెట్టుకుని వెళ్తాం. మొన్న మా పక్కనే ఫ్లయిట్ లో ఖుష్బూ గారు కూడా వస్తున్నప్పుడు అడిగాను ఎంత అందంగా ఉన్నారో ఆ పాటలో ఎలా చేశారు అని పోయిన వారమే ఆ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నువ్వు ఆ పాట పాడి నా మనసు దోచేసుకున్నావ్...అసలు ఈరోజు నా మైండ్ ఎలా ఉంది అంటే మార్నింగ్ సెరిలాక్ తినని పిల్లలు ఎలా ఉంటారు అలా ఉంది..కానీ నువ్వు ఈ పాట పాడి నా మూడ్ మొత్తం మార్చేశావ్" అన్నాడు దానికి చిత్ర గారు "ఇక్కడ కూడా సెరిలాక్ బేబీ లానే ఉన్నావ్" అన్నారు నవ్వుతూ. "అవును నేను 96 టైంలో నేను ఆవిడతో ట్రావెల్ చేసాను ఆస్ట్రేలియాకి. నేను ఫస్ట్ టైం ఫ్లయిట్ ఎక్కిందే చిత్రాగారితో..ఎక్కడికి వెళ్లినా ఆవిడని బెండకాయ కూర ముద్దపప్పు అడిగేవాడిని.
నా ఫేవరెట్ ఫుడ్ అదే. ఆవిడే అందరూ ఎం తింటారో కనుక్కుని వంట చేసి పెట్టేవారు. ఇక బాలు గారైతే చిత్ర పట్టుకో ఆ చిన్నబ్బాయిని పట్టుకో అనేవారు అప్పుడు నా వయసు 11 ఏళ్ళు. ఈవిడే నన్ను జాగ్రత్తగా తనతో తీసుకెళ్లేవారు.నా ఫీడర్ ఆవిడే" అంటూ తమన్ తన బెస్ట్ మెమరీని తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజి మీద షేర్ చేసుకున్నారు. ఇక గీత మాధురి మాట్లాడుతూ మేడం మీరు మ్యుజిషియన్స్ కోసం మీరు ఎలా ఆలోచిస్తారో జయరాం ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి అని చెప్పింది. అప్పుడు చిత్ర "చాలా సంతోషం జయరాం..నాకు స్నేహానందన అనే చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉంది. దాని ద్వారా నేను ఎప్పుడైనా మ్యుజిషియన్స్ కోసం ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు నువ్వు కూడా నాతో వచ్చి పాడాలి" అని మంచి ఆఫర్ ఇచ్చారు.
![]() |
![]() |